72 గ్రామాల్లో భూభారతి భూ సర్వే.. పరిశీలించిన రెవెన్యూ అదనపు కలెక్టర్
72 గ్రామాల్లో భూభారతి భూ సర్వే.. పరిశీలించిన రెవెన్యూ అదనపు కలెక్టర్
Collector


యాదాద్రి భువనగిరి, 31 జూలై (హి.స.)

పైలట్ ప్రాజెక్టు కింద యాదాద్రి భువనగిరి

జిల్లాలో 72 గ్రామాలలో భూభారతి భూ సర్వే పనులను ప్రారంభించినట్లు యాదాద్రి భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తెలిపారు. మండలంలోని రీ సర్వే జరుగుతున్న బసంతపురం గ్రామాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కె. వెంకా రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అవసరమైన రోవర్సు అందుబాటులో లేవని కేవలం 11 మాత్రమే ఉన్నాయని మిగిలిన రోవర్సు కొనుగోలు చేయడం అద్దెకు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 1924 సంవత్సరంలో భూ సర్వే జరిగిందని తిరిగి ఈ ఏడాది ప్రభుత్వం భూ సర్వేను చేపట్టేందుకు శ్రీకారం చుట్టిందని అదరపు కలెక్టర్ తెలిపారు. అనుకున్న సమయం వరకు సర్వే పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు, సర్వే పూర్తి అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వివరాలను తెలుపుతూ నోటీసు ఏర్పాటు చేయనున్నట్లు, ఆక్షేపణలు ఉంటే స్పందించి రి సర్వే చేనున్నట్లు, మూడు దఫాలుగా రైతుల నుండి వివరాలు సేకరణ కోసం అవకాశం కల్పించనున్నట్లు వెంక రెడ్డి చెప్పారు. రాజపేట మండలంలోని బసంతాపురం, కాల్వపల్లి,లక్ష్మక్క పల్లి, బూరుగుపల్లి గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ సర్వే ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొలత వేయనున్నారని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు పట్టా భూములు అన్నీ స్పష్టమైన హద్దులతో సర్వే చేయబడతాయని స్పష్టం చేశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చి, రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. బసంతపురం గ్రామ రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, సర్వే బృందం నిర్వహిస్తున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను కచ్చితంగా నమోదు చేసి, భూ వివాదాలకు తావులేకుండా సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందితో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande