ఏపీ. హస్తకళల ను. ప్రపంచ.నలుమూల కు.తీసుకెళ్దాం..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ. హస్తకళల ను. ప్రపంచ.నలుమూల కు.తీసుకెళ్దాం..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
pawan kalyan


అమరావతి, 07 జూలై (హి.స.)

ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేడ్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

‘‘వంశపారపర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే. హస్తకళా రంగాలు భారతదేశ మూలాలు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగాలంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలి. ఒక జాతి గొప్పతనం.. నిర్మించిన భవనాల్లో కాదు.. కళాకారుల్లో కనిపిస్తుంది. కళాకారుల ప్రతిభ.. వారి కష్టాన్ని గుర్తించడానికే ఇక్కడికి వచ్చాను. సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉంది. వస్తువుల తయారీ మాత్రమే కాదు.. వారసత్వాన్నీ సజీవంగా ఉంచుతున్నారు. తరతరాల సంప్రదాయాన్ని కళాకారులు కాపాడుతున్నారు.

రాష్ట్రంలో 2 లక్షల మందికిపైగా కళాకారులున్నారు. గ్లోబల్ మార్కెట్కు అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి కొత్త దశను తీసుకొస్తాం. వదిలేసిన వస్త్రాలు కూడా వ్యర్థం కాకుండా వస్తువుల తయారీ చూస్తున్నాం. డబ్బు సంపాదనే కాదు.. పర్యావరణ పరిరక్షణ కూడా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలి. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి.. ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు.. లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పని చేద్దాం’’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande