పొదలి పాఠశాల కళాశాల.బస్సులను తనిఖీ చేసిన ఎస్ ఐ ఎస్ రాజేష్
పొదలి పాఠశాల కళాశాల.బస్సులను తనిఖీ చేసిన ఎస్ ఐ ఎస్ రాజేష్
పొదలి పాఠశాల కళాశాల.బస్సులను తనిఖీ చేసిన ఎస్ ఐ ఎస్ రాజేష్

పొదిలి:, 09 జూలై (హి.స.)

పొదిలిలోని ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల బస్సులను ఎస్సై ఎస్ రాజేష్ గురువారం తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సులను నిదానంగా నడపాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. డ్రైవర్లపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని విచారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande