
తిరుమల:, 09 జూలై (హి.స.)
అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో తిరుపతి జేఈవో ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, రాజేంద్ర, సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, డీఈ చంద్ర శేఖర్, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జీ.ఎల్.ఎన్. శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ