
హాలహర్వి:, 09 జూలై (హి.స.)
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని టీబీ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో గురువారం ఉదయానికి 28,654 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగిందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 13.67 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. తుంగభద్ర జలాశయానికి నీరు వస్తుండటంతో కర్నూలు జిల్లాలో తాగు నీటి సమస్య తీరుతుందని ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ