పంచారామ క్షేత్రం అమరావతి అమరేశ్వర ఆలయం లో వసతి.లేక ఇబ్బందులు
పంచారామ క్షేత్రం అమరావతి అమరేశ్వర ఆలయం లో వసతి.లేక ఇబ్బందులు
amara ramam


అమరావతి, 08 జూలై (హి.స.)

అమరావతి, పంచారామ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో వసతి కావాలంటే ఉపాలయ మండపాలు, చెట్ల నీడే దిక్కు. భక్తులు ఉండేందుకు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ ఆలయాల్లో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వసతి భవనాలు నిర్మించి, తక్కువ అద్దెకు అందుబాటులో ఉంచారు. దాతలు ముందుకు వచ్చి గదులు నిర్మించి ఆలయానికి అప్పగిస్తుంటారు. కానీ అమరేశ్వరాలయంలో ఆ పరిస్థితి లేదు. 2004, 2009లో దాతల సహకారంతో నిర్మించిన వసతి గదులు కూడా శిథిలావస్థకు చేరినా అధికారులు దృష్టి పెట్టడం లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande