
కావలి, 08 జూలై (హి.స.)
,: పురపాలక సంఘం పరిధిలో ఎక్కడా రహదారి అంచు ఖాళీ లేకుండా చేస్తున్నారు. రాత్రివేళల్లో బంకుల ఏర్పాటు, చిన్నపాటి దుకాణాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తొలిగా తాత్కాలిక బంకులు ఏర్పాటు చేసి.. అనంతరం శాశ్వతంగా ఉంచుతున్నారు. వాటన్నింటికీ స్థానికంగా ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు అండగా ఉంటున్నారు. తొలుత ఆక్రమించి ఆ తరువాత చిరువ్యాపారులకు రోజుకు లేక నెలవారీ అద్దెకు ఇస్తున్నారు
వెంగళరావునగర్ ప్రాంతంలో గత ఏడాది పురపాలక సంఘం తరఫున 10-12 అడుగుల పొడవు, వెడల్పులతో సమకొలతల ఏకరీతి బంకులు కొలువుదీరాయి. నెల్లూరు నగరంలోని సండేమార్కెట్ తరహాలో ఏర్పాటు చేశారు. వాటిని పొందిన చిరువ్యాపారులు పురపాలక సంఘానికి నెలవారీ అద్దెలు చెల్లిస్తున్నారు. చిరువ్యాపారుల ముసుగులో దళారీలకు అడ్డుకట్ట పడేలా రూపొందించిన ఈ సమకొలత బంకుల విధానం కొనసాగించాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ