
అమరావతి, 08 జూలై (హి.స.)
ఏపీలో నెక్స్ట్జెన్ అథ్లెటిక్ ఫుట్వేర్ ఆర్అండ్డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కుప్పం కేంద్రంగా దక్షిణ భారత సమగ్ర ఫుట్వేర్ తయారీ క్లస్టర్కు ప్రతిపాదన చేశారు. తిరుపతిలో విడిభాగాల తయారీ, విశాఖపట్నంలో డిజైన్, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏపీలో టైర్-1, టైర్-2 వెండర్లతో సప్లయర్ మీట్ నిర్వహించాలని హ్వాసంగ్కు ఆహ్వానం పలికారు. కుప్పంలో రూ.900 కోట్లతో గ్రీన్ఫీల్డ్ నాన్ - లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు. ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూల తయారీ లక్ష్యంగా హ్వాసంగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ప్రతినిధులు వివరించారు. అడిడాస్ సహా గ్లోబల్ బ్రాండ్లకు OEM సరఫరాదారుగా హ్వాసంగ్ ఉండనుందని వెల్లడించారు. తొలి దశలో ఎగుమతులు.. ఆపై దేశీయ మార్కెట్పై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ