
ప్రకాశం జిల్లా, 08 జూలై (హి.స.)
:ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణ సమయంలో మహిళా కార్యకర్తలతో కొందరు పురుష కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఓ మహిళ కార్యకర్తపై వైసీపీ నేత చేయి కూడా చేసుకున్నారు.
ఈ క్రమంలో పురుషులు, మహిళలు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. మహిళలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం తోపులాట, వాగ్వాదానికి దిగగా, పురుష కార్యకర్తలు చొక్కాలు చించుకునే వరకు ఘర్షణ కొనసాగింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ