
హైదరాబాద్, 08 జూలై (హి.స.)డీఎస్పీ భీమ్రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమోరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్రెడ్డి ఆస్తుల విలువ రూ.300 కోట్లపైన ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉంటున్న విల్లా ఎలా కొన్నారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. మెమొరీ కార్డులు, డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెమోరీ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
నాకు ఇవ్వాల్సిన వాళ్లు, నేను ఇవ్వాల్సినవి’ అంటూ డీఎస్పీ భీమ్రెడ్డి తన డైరీలో రాసుకున్నాడు. బినామీలు ఇప్పుడైనా తిరగబడే ప్రమాదం ముందే ఊహించాడు. అక్రమాస్తులు కూడా పెట్టడంలో భీమ్రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆస్తులను బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. బినామీలు ఎప్పుడైనా తిరగబడే ప్రమాదం ఉందని ముందే ఊహించాడని చెప్పారు. బినామీ దగ్గర నుంచి క్యాన్సిలేషన్ డీట్లు ముందే రాయించుకున్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్