గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ..
గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ..
Revanthreddy


హైదరాబాద్, 08 జూలై (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్( కార్పొరేట్ వ్యవహారాలు) రాకేశ్స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి ఈరోజు (బుధవారం) కలిశారు. గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు రాకేశ్ స్వామి. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపైన సీఎం చర్చించారు.

ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సీరీ, ఆర్ అండ్ డీ కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్నిఈ సంస్థ కోరింది. ప్రాసెసింగ్ మిల్ కోసం రోడ్డును విస్తరించాలని ముఖ్యమంత్రిని ఈ సంస్థ ప్రతినిధులు కోరారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande