హస్త.కళాకారులకు కూటమి సర్కారు అండ
హస్త.కళాకారులకు కూటమి సర్కారు అండ
pawan kalyan


అమరావతి, 08 జూలై (హి.స.)

చేనేత, హస్త కళాకారులకు కూటమి సర్కారు అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. కళాకారులకు ఏ సమస్య వచ్చినా తనను కలవవచ్చనీ.. మనదైన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించటమే లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన హస్తకళా మహోత్సవం-2026ను విజయవాడలో ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు వచ్చి తమ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పవన్ వీక్షించారు. తోలుబొమ్మల కళాకారులు ప్రదర్శించిన రావణ సంహార ఘట్టాన్ని వీక్షించారు. సతీమణి కోసం ఉప్పాడ పట్టుచీర కొన్నారు. కళాకారులతో ఫొటోలు దిగారు. వీరి కోసం నిర్వహించనున్న శిక్షణను ఆయన ప్రారంభించారు. గుంటూరు, కాకినాడల్లో పునరుద్ధరించిన లేపాక్షి షోరూమ్లను, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నూతన షోరూమ్ను వర్చువల్గా ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande