తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
JP nadda


హైదరాబాద్, 08 జూలై (హి.స.)కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) రేపు (గురువారం) తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం 10:55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంటల వరకు ఎయిమ్స్పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2:45 నుంచి బీబీనగర్ ఎయిమ్స్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.

రేపు మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో నడ్డా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5:10 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి తాజ్ డెక్కన్కు వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు తాజ్ డెక్కన్లో మేధావులతో సమావేశం కానున్నారు. తాజ్ డెక్కన్ నుంచి 7:10 నిమిషాలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్ట్నకు వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి జేపీ నడ్డా వెళ్లనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande