రావణ్ ఫోన్ లో అమ్మాయిల వీడియోలు.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు!
రావణ్ ఫోన్ లో అమ్మాయిల వీడియోలు.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు!
రావణ్ ఫోన్ లో అమ్మాయిల వీడియోలు.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు!


హైదరాబాద్, 08 జూలై (హి.స.)

హిందూ దేవతలను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వెనుక ఉన్న అసలు అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈనెల 1న పిఠాపురం పోలీసుల చేతిలో అరెస్టయిన రావణ్ ఫోన్ డేటాను కాకినాడ పోలీసులు విశ్లేషించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టుకు ముందే అతను ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయడంతో, పోలీసులు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం... అమాయక యువతులను టార్గెట్ చేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి రావణ్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. 10 మందికి పైగా రావణ్ బాధిత యువతులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

మరోవైపు, రావణ్‌పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా సమాజంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యతకు భంగం కలిగించినందుకు గానూ కొత్త చట్టం బీఎన్‌ఎస్ సెక్షన్ 152తో పాటు, కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు. కోర్టు అతనికి ఈనెల 18 వరకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రావణ్ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఒకవైపు బ్లాక్‌మెయిల్ దందాలు, మరోవైపు దేశద్రోహం కేసులతో రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande