
నంద్యాల , 08 జూలై (హి.స.) నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది... సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామ సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా, ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వస్తున్న పాపయ్య లోడ్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు కాగా, వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV