రేణిగుంటలో ఘనంగా వైఎస్సార్ జయంతి
రేణిగుంటలో ఘనంగా వైఎస్సార్ జయంతి
రేణిగుంటలో ఘనంగా వైఎస్సార్ జయంతి


రేణిగుంట, 08 జూలై (హి.స.)తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

రేణిగుంట పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఈ రోజు బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయురాలు పవిత్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి జైహో వైఎస్సార్ నినాదాల మధ్య ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు.

ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ,డాక్టర్ వైఎస్సార్ బడుగు,బలహీన వర్గాల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.వైఎస్సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande