
తుని పట్టణం , 09 జూలై (హి.స.)
: కాకినాడ జిల్లా తునిలో వరుస చోరీలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒకటో వార్డులోని డ్రైవర్స్ కాలనీలో ఓ ఇంట్లో దుండగుల భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాల చోరీ ఘటన మరువకముందే మరో ఘటన ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకు కాలనీలో ముందునూరి శ్రీనివాసరాజు నివాసంలో అర్ధరాత్రి దుండగులు చొరబడి నాలుగు కేజీల వెండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. అనంతరం పలు ఇళ్లలో కూడా చోరీకి ప్రయత్నించారు. ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి ఓ సీసీ కెమెరాను పక్కకు తిప్పేశారు. ఇద్దరు వ్యక్తులు చేతికి గౌజులు వేసుకుని, బలమైన ఇనుపరాడ్డులో హల్చల్ చేశారు. రెండస్తుల్లో తలుపులు పగులగొట్టి బీరువాలు తెరచి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి గంటన్నరపాటు ఇదే ప్రాంతంలో తిరిగారు. ద్విచక్ర వాహనంపై వెళ్లి మళ్లీ వచ్చారు. పక్కనే మరో ఇంట్లో చోరీకి యత్నించారు. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించి జారుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఓ ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోద చేశారు. క్లూస్ టీం, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ