ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు
ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు
ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు


తుని పట్టణం, 09 జూలై (హి.స.)

కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు కెనరా బ్యాంకు సహకారంతో సుమారు రూ.30 లక్షలతో సమకూర్చిన వైద్య సామగ్రిని ఎమ్మెల్యే యనమల దివ్య, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రారంభించారు. ఆర్థో విభాగానికి సంబంధించి ఫిజియోథెరఫీ, వివిధ రకాల పరికరాలు అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆయా వార్డులో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఇబ్బందులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నూతనంగా అత్యాధునిక ల్యాబ్ అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందించామని, త్వరలోనే అప్గ్రేడ్ అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. దీంతో రోగులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande