గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి లభ్యతను మెరుగుపరిచేలా
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి లభ్యతను మెరుగుపరిచేలా
Theft of drinking water


ఆనందపురం: , 09 జూలై (హి.స.)

గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంపొందించి తాగునీటి లభ్యతను మెరుగుపరచాలనే లక్ష్యంతో చెన్నైకి చెందిన స్పాంజ్ కొలాబరేటివ్ సంస్థ గూగుల్ సహకారంతో అధ్యయనం చేపట్టింది. ఆనందపురం మండలంలోని తర్లువాడ, సొంఠ్యం, ఆనందపురం, గిడిజాల, గంభీరం గ్రామపంచాయతీల్లో మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధ్యయనం ముగింపులో గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై స్థానిక అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్లో భాగంగా కాంటూర్ ట్రెంచ్లు, స్టోన్ బండింగ్, ఫార్మ్ పాండ్లు, రీఛార్జ్ బావులు, చెరువుల పూడికతీత, అనుసంధాన కాలువల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఆనందపురంలో 9, సొంఠ్యంలో 5, గిడిజాలలో 7, తర్లువాడలో 7 చెరువులతో పాటు గంభీరం రిజర్వాయర్ను ఎంపిక చేశారు. సమగ్ర నివేదికను గూగుల్కు సమర్పించిన అనంతరం నవనిర్మాణ సమితి, అంబుజా ఫౌండేషన్ సహకారంతో పనులు చేపట్టనున్నట్లు స్పాంజ్ కొలాబరేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ రాజ్, అసోసియేట్ అర్బన్ డిజైనర్ ఆదిత్య హజారే తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande