
దేవీపట్నం:, 09 జూలై (హి.స.)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. ఒడ్డును తాకుతున్న జలాలు.. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి పాదాలను తాకాయి. దీంతో ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దండంగి-డి, రావిలంక గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారిపై వరద ప్రవాహం పెరగడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ