
అమరావతి, 10 జూలై (హి.స.)
చీరాల అర్బన్, ఇటీవల కాలంలో రైళ్లలో చోరీలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని జీఆర్పీ పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే 139 రైల్వే హెల్ప్లైన్ నంబరుకు ఫోను చేయాలి. అక్కడ నుంచి ఆయా విభాగాలకు తక్షణమే సమాచారం చేరుతోంది. దూరప్రాంతాలు, రాత్రి వేళల్లో వెళ్లే పలు రైళ్లల్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల గస్తీ ఉంటుంది. టీటీఈ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే ప్రయాణికులు వీరికి నిర్భయంగా చెప్పవచ్చు. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ