కట్నం వేదింపులు. తాళలేక.ఓ వివాహిత ఆత్మహత్య
కట్నం వేదింపులు. తాళలేక.ఓ వివాహిత ఆత్మహత్య
Suicide


అమరావతి, 10 జూలై (హి.స.)

పీఎంపాలెం, అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎండాడ బీసీ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ఎండాడ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్లో నివశిస్తున్న వస్త్ర వ్యాపారి మడగల మంజునాథ్ కుమార్తె ఎం.సంధ్య (23)ను ఎండాడ బీసీ కాలనీకి చెందిన కారు డ్రైవరు వేముల వలస రామును ప్రేమించింది. దీంతో పెద్దల అంగీకారంతో 2023లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలతో కలిసి ఆమె బీసీ కాలనీలో నివాసం ఉంటోంది. వివాహమైన ఏడాది వరకు అంతా కలిసి మెలిసి బాగానే ఉన్నారు. ఆపై పిల్లలు పుట్టడం లేదనే సాకుతో అదనపు కట్నం తీసుకు రావాలని సంధ్యను భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు కొడుతూ ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో వారి వేధింపులు భరించలేక గురువారం ఉదయం తండ్రికి ఫోన్ చేసి కన్నీరుమున్నీరైంది. దీంతో తాను స్వయంగా అత్తింటి వారితో మాట్లాడతానని తండ్రి కుమార్తెకు నచ్చచెప్పారు. ఇది జరిగిన తర్వాత తెళ్లారి ఉదయం సంధ్య పడక గదిలో తలుపులు గడియ వేసుకుందని, ఎంత కొట్టినా తెరవడం లేదని అల్లుడు రాము నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. అనంతరం వచ్చి తలుపులు పగలుగొట్టడంతో ఆమె ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సంధ్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్.ఐ.నరేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande