
కందుకూరు పట్టణం, 09 జూలై (హి.స.)
, : ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా కందుకూరు పట్టణానికి చెందిన చేబ్రోలు సురేంద్రను సింగపూర్ నుంచి కోఆర్డినేటర్గా నియమించింది. ఆయన గత కొన్నేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, తర్వాత కొన్ని వ్యాపారాలు ప్రారంభించారు. తెదేపా కార్యక్రమాల నిర్వహణలో తన వంతు కృషి చేస్తూ, సింగపూర్కు భారతదేశం నుంచి వచ్చే వారికి అందిస్తున్న సహాయ సహకారాలను గుర్తించి ప్రభుత్వం ఎన్ఆర్టీ కోఆర్డినేటర్గా నియమించినట్లు సురేంద్ర తెలిపారు. దేశ, విదేశాల్లోని ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం కోఆర్డినేటర్లు పనిచేయాలని, భారత ఎంబసీలు, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ సేవలు అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తమకు సూచించారని సురేంద్ర వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ