
హైదరాబాద్, 09 జూలై (హి.స.)
ఢిల్లీ పార్లమెంట్లో భారత్ రాష్ట్ర
సమితి (BRS) తమ పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో కొనసాగిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను ఎన్నుకున్నట్లుగా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అధికారికంగా లేఖ రాశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇకపై రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ తరపున వద్దిరాజు రవిచంద్ర ఫ్లోర్ లీడర్గా వ్యవహరించి పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..