పోక్సో కేసులో కీలక పరిణామం: బండి భగీరథ్కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో కీలక పరిణామం: బండి భగీరథ్కు బెయిల్ మంజూరు
బండి భగీరథ


హైదరాబాద్, 09 జూలై (హి.స.)

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన

పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పును ప్రకటించారు. రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు (Sureties) సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తూ భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ ఇవ్వగా.. గడువు ముగిసిన తర్వాత ఆయన జూన్ 25న తిరిగి జైలులో లొంగిపోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్్ప పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు మే 16వ తేదీన భగీరథను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande