
నిర్మల్, 09 జూలై (హి.స.)
ఎస్ఐఆర్ ఫారంల ఆన్లైన్ ప్రక్రియ వెంట వెంటనే పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసర, తానూర్, కుబీర్, మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎస్ఐఆర్ ఫారంలను పూరించుటలో ఓటర్లకు, అధికారులు బీఎల్ ఓలు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన ఎస్ఐఆర్ ఫారముల డిజిటలీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఎలీలు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎస్ఐర్ విషయంలో సహాయం చేయాలన్నారు. సూపర్వైజర్లు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం తానూరు మండలం సింగన్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. మొత్తం పంపిణీ చేసిన ఫారములు, ఇప్పటివరకు, తిరిగి తీసుకున్న ఫారములు, పూర్తి చేసిన డిజిటలైజేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కుబీర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన డిజిటలైజేషన్ ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. యాప్ లో వివరాలను పరిశీలించారు. సమీపంలోని ఓటర్ ఇంటికి వెళ్లి, వారు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారో లేదో అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..