మాజీ మంత్రి కొడాలి నాని పై మండిపడ్డ బుద్ధ వెంకన్న
మాజీ మంత్రి కొడాలి నాని పై మండిపడ్డ బుద్ధ వెంకన్న
nani


అమరావతి, 09 జూలై (హి.స.)

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి కొడాలి నాని అని అన్నారు. హనుమంతుడి ముందు కుప్పి గంతలు వేసిన విధంగా నాని, వంశీల తీరు ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ఓటమి తరవాత కొడాలి నాని కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారని.. ఇప్పుడు మళ్లీ నాగుపాములా బుసలు కొట్టాలని చూస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను నీచంగా తిట్టిన వ్యక్తి రావణ్ అని తెలిపారు.

హిందూ దేవుళ్లను రావణ్ కించపరిచారని.. అతడిపై ఉపా చట్టం పెడితే.. ఉప్మా, ఇడ్లీ అని అవమానిస్తారా అంటూ వెంకన్న ఫైర్ అయ్యారు. ఉపా చట్టాలను అవమానం చేసిన కొడాలిపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘జోసెఫ్ రావణ్ మీవాడే అని అందరికీ తెలుసు. జోసెఫ్కు మద్దతుగా జగన్ ప్రకటన చేశారు. క్రిమినల్స్, హంతకులకు మద్దతు ఇచ్చే పార్టీ వైసీపీ. ఇక నుంచి మీ సంగతి చూస్తాం. కొడాలి నాని నీకిదే లాస్ట్ వార్నింగ్.. పిచ్చి పిచ్చిగా వాగితే బుద్ధి చెప్పి తీరుతాం’ అని హెచ్చరించారు.

‘జగన్ ఓటమికి మీ బూతులే కారణమని మీ నాయకులే చెప్పారు. అధికారంలో ఉంటే విర్ర వీగుతారా..? అధికారం లేకుంటే పుట్టలో పడుకుంటారా..? ఇటువంటి విష నాగులను జగన్ పాలు పోసి పెంచుతున్నారు. మేము మీ ప్రభుత్వంలో కూడా మీ తప్పులను ప్రశ్నించాం. మీలాగా దాక్కుని... తీరిగ్గా వచ్చే రకం కాదు. దర్జాగా మీ తప్పులని ఎత్తి చూపాం. రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయి... ఇప్పుడు వచ్చి వాగుతున్నావు. దమ్ముంటే రా... బహిరంగ చర్చకు మేము సిద్ధం’ అంటూ బుద్దా వెంకన్న సవాల్ విశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande