
ముంబై, 09 జూలై (హి.స.)అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,120గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,190గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు
భారతదేశంలోని వివిధ నగరాల్లో పన్నులు, రవాణా ఛార్జీల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,540 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,32,490గా నమోదైంది. ఇక18 క్యారెట్ల తులం గోల్డ్ రూ.1,10,690గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,43,270గా ఉండగా.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగా రూ.1,31,340గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ.1,43,120గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,31,190గా నమోదైంది.
వెండి ధరలు ఇలా
బంగారంతో పాటే హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు కూడా సామాన్యులకు భారీ ఊరటనిస్తున్నాయి. బుధవారం ఏకంగా రూ.5,000 మేర భారీగా పతనమైన కిలో వెండి ధర.. ఇవాళల కూడా అదే బాటలో పయనించి మరో రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం భాగ్యనగరంలో ఒక గ్రాము వెండి ధర రూ.244.90 కి చేరగా, కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్లోనూ ఇదే విధమైన ధరలు నమోదు కాగా, ఢిల్లీలో మాత్రం కిలో వెండి రూ.2,45,100 వద్ద కాస్త ఎక్కువగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV