అనంతపురంలో రాజకీయ ఉద్రిక్తత.. ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు
అనంతపురంలో రాజకీయ ఉద్రిక్తత.. ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు
political-tension-in-anantapur-heavy-police-deployment-at-the-homes-


అనంతపురం, 09 జూలై (హి.స.) అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మధ్య పరస్పర సవాళ్లు, ఆరోపణలతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎంఎస్ రాజు సవాల్ విసరగా, ఆరోపణలు నిరూపించకపోవడంతో ప్రకాశ్రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. మరోవైపు, తన నివాసానికి టీడీపీ శ్రేణులు వస్తే రాళ్లతో దాడి చేసేందుకు కంకర సిద్ధం చేశారనే సమాచారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో కంకరను తొలగించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పోలీసులతో ప్రకాశ్రెడ్డి కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి నివాసాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande