శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం
శ్రీకాళహస్తి ధర్మరాజ స్వామి బ్రహ్మోత్సవాలపై అధికారుల రివ్యూ
శ్రీకాళహస్తి  బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం


శ్రీకాళహస్తి , 09 జూలై (హి.స.) శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానంలో సమన్వయ సమావేశం జరిగింది.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి.కె. వెంకటేశులు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, ఒకటో టౌన్ సీఐ, రెండో టౌన్ సీఐ, అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులు, ఏరియా ఆసుపత్రి సిబ్బంది, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్, ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ఈఓ బి.కె. వెంకటేశులు అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande