వైకుంఠం కంపార్ట్మెంట్లు ఫుల్.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
వైకుంఠం కంపార్ట్మెంట్లు ఫుల్.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమల


తిరుమల, 09 జూలై (హి.స.) ఆపదమొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్లు కిక్కిరిసిపోయాయి.

మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Kuntham Queue Complex)లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Free Darshan) ప్రస్తుతం దాదాపు 18 గంటల సమయం పడుతోంది.

ఇక క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) సిబ్బంది నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు.

బుధవారం స్వామి వారిని 82,172 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,978 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ నుంచి వివిధ కానుకల ఆదాయం రూ. 5.15 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande