
శ్రీకాకుళం,, 01 ఆగస్టు (హి.స.)
మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహిళ అని కూడా చూడకుండా విధుల్లో ఉన్న ఎస్ఐపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఘటనతో సంబంధం ఉన్న అందరిపై కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. డీజీపీ కార్యాలయం నుంచి శ్రీకాకుళం పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళా ఎస్ఐపై దాడి చేసిన వారిని, పోలీసులపైకి దూసుకెళ్లిన వారిని వదిలిపెట్టవద్దని, అందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రధాని, సీఎం పర్యటనలు ఉన్నప్పటికీ ఈ కేసులో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ