ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను అందిస్తున్నాము.. టీడీపీ ఇంచార్జి జేబీ.శ్రీనివాస్
ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను అందిస్తున్నాము.. టీడీపీ ఇంచార్జి జేబీ.శ్రీనివాస్
ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను అందిస్తున్నాము.. టీడీపీ ఇంచార్జి జేబీ.శ్రీనివాస్

తిరుపతి, 01 ఆగస్టు (హి.స.)

: ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తున్నామని తెదేపా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాల (డోర్ టు డోర్ కార్యక్రమం)తోపాటు సామాజిక పింఛన్ల పంపిణీని చేపట్టింది. క్లస్టర్-13 డివిజన్లలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్తోపాటు ఆయన ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలపై లబ్ధిదారులతో మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పింఛన్ పంపిణీకి వాలంటీర్లు కమీషన్ తీసుకునేవారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తోందన్నారు. అదేవిధంగా డోర్ టు డోర్ కార్యక్రమంతో సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం చూపుతున్నామని ఆయన వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande