
అమరావతి, 01 ఆగస్టు (హి.స.)
మహానంది: రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలో వరుణయాగం హోమాలు, జపాలు, సహస్ర ఘటాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మామిళ్లపల్లె అర్జునశర్మ, వేదపండితులు చండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారామ్భట్, హనుమంతరాయశర్మలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన రుత్వికులు, దేవస్థానం అర్చకులు వేదోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఘటార్చన, వరుణ జపాలు, పర్జన్య హోమాలు, మహాపూర్ణాహుతి, ఘట ప్రదక్షిణలు, 1116 కడవలతో మహానందీశ్వరస్వామివారికి ఘాటాభిషేకాన్ని నిర్వహించారు. ఈ పూజల్లో దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల మధుల, దేవస్థానం సిబ్బంది, స్థానికులు, పలు గ్రామాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ