సీఎం రేవంత్ది బాధ్యతారాహిత్యం
ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం దురదృష్టకరం ...కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి.
kishan reddy


హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం సీఎం రేవంత్రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన మార్పులేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కిషన్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హార్వర్డ్ యూనివర్సిటీ వీకెండ్ క్లాసులో నేర్చుకున్న రెండు పదాలను ఇక్కడికొచ్చి వాడేద్దామనే ప్రయత్నంలో.. జెన్ జీని అవమానిస్తున్నారనే విషయాన్ని సీఎం మర్చిపోయినట్టున్నారు. తెలిసీ తెలియని పదాలను వాడి తానేదో మేధావినని నిరూపించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత సీఎం.. ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలపై ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో? ఫీజు రీయింబర్స్మెంట్ చేయమని అడుగుతున్నారనే అక్కసుతో విదార్థులను క్రిమినల్స్తో పోల్చడం సిగ్గుచేటు. రూ.10,000 కోట్ల ఫీజు బకాయిలు ఉండగా, అందులో రూ.5,000 కోట్లకుపైగా ఇంజినీరింగ్ విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఇవ్వలేక సీఎం ఫ్రస్ట్రేషన్లో విద్యార్థులను క్రిమినల్స్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తే.. ‘తమాషాలు చేస్తే తాట తీస్తా’మని సీఎం మాట్లాడారు. ఫీజు బకాయిలు అడిగితే విద్యాసంస్థలపై విజిలెన్స్తో దాడులు చేయించారు. ఎన్నికల సమయంలో బడ్జెట్లో విద్యాశాఖకు 15% కేటాయిస్తామన్న హామీని రేవంత్ అటకెక్కించారు.ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లు అంతర్జాతీయ ఐటీ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో లేరా? అలాంటి విద్యార్థులను కేసీఆర్, రేవంత్రెడ్డి తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంజినీరింగ్ విద్యలో మరింత నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కలిసి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడంలో చొరవ తీసుకోవాలి. అంతేకానీ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడకూడదు’ అని కిషన్రెడ్డి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande