నిలిచిన ఈపీఎఫ్ పింఛన్లు
కొత్త సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయడమే కారణం తెలుగు రాష్ట్రాల్లో 7.92 లక్షల మంది.
Epfo


హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్వో) పింఛన్లు నిలిచిపోయాయి. చిన్న మొత్తంలో ప్రతినెలా 27న బ్యాంకు ఖాతాల ద్వారా అందుకునేవారికి జులై నెలాఖరైనా మంజూరు కాలేదు. ఈపీఎఫ్వోలో కొత్త సాఫ్ట్వేర్ ఉన్నతీకరణ నేపథ్యంలో ఈ సమస్య నెలకొంది.తెలంగాణలో 4.63 లక్షలు, ఏపీలో 3.29 లక్షల మంది పింఛనుదారులకు పింఛన్లు నిలిచిపోయాయి. ఇటీవల ఈపీఎఫ్వో సాఫ్ట్వేర్లో కీలక మార్పుల తర్వాత సెంట్రలైజ్డ్ డేటాబేస్ ద్వారా పింఛన్లను మంజూరు చేస్తుండటంతో.. తెలుగు రాష్ట్రాలకు చెల్లింపు ప్రక్రియ స్లాట్ శుక్రవారం లభించింది. ఈ క్రమంలో శనివారం లేదా సోమవారం రోజున పింఛన్లు మంజూరయ్యే అవకాశాలున్నట్లు ఈపీఎఫ్వో వర్గాలు వెల్లడించాయి. జులై నెలకు మాత్రమే ఆలస్యమైందని.. వచ్చే నెల నుంచి పూర్వవిధానంలో చెల్లింపులు ఉంటాయని వివరించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande