
నిర్మల్, 01 ఆగస్టు (హి.స.)
గ్రామాల అభివృద్ధికి రోడ్డు మార్గాలే
ప్రధానమని మండల అభివృద్ధికి అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలో జరిగిన రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు. కుబీర్ నుండి డోడర్నా సరిహద్దు వరకు 1.98కోట్లతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మండల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రహదారుల ప్రధానమన్నారు. వివేకానంద నుంచి వెటర్నరీ ఆసుపత్రి వరకు డివైడర్ పనుల టెండర్ పూర్తి అయిందన్నారు.
ప్రతి గ్రామపంచాయతీలో వివో భవనాలను నిర్మించుకోవాలన్నారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి, పేదలైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. సమీక్ష సమావేశంలో పలువురు సర్పంచులు మాట్లాడుతూ యూరియా, డీఎపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదన్న మిషన్ భగీరథ నీళ్లు కలుషితమై వస్తున్నాయని తెలిపారు. ఆయా శాఖల అధికారంలో ఉన్న తమ నివేదికలను చదివి వినిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..