
ములుగు, 01 ఆగస్టు (హి.స.)
మూడవ ప్రమాద హెచ్చరికకు దగ్గరగా
ప్రవహిస్తున్న గోదావరిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. శనివారం ఉదయమే మండల కేంద్రంలోని మార్కెట్ గోదాముల వద్ద గోదావరి ఉధృతిని, కరకట్ట పనులను పరిశీలించిన మంత్రి సీతక్క లోతట్టు ప్రాంతాల ముంపు గురించి రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఐబీ అధికారులతో ఆరా తీశారు. మండల కేంద్రంలోని పొద్మూరు, ముస్లీం వాడ, బీసీ కాలనీలోని ముంపు ప్రాంతాల ప్రజలను పురావాస కేంద్రంలో ఉంచి సహాయక చర్యలు చేపడుతుండంగా వారిని కలిసి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
గోదావరి ఉధృతి తగ్గే వరకు అధికారులు అందుబాటులో ఉండి నిర్వాసితులకు, ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న లోతట్టు ముంపు ప్రాంతాల గురించి తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై టీవీఆర్ సూరి, ఎంపీడీవో భద్రులు మంత్రి సీతక్కకు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..