నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్గా నిర్మల్ కలెక్టర్.. ఉత్తర్వులు జారీ
నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్గా నిర్మల్ కలెక్టర్.. ఉత్తర్వులు జారీ
Collector


నిజామాబాద్, 01 ఆగస్టు (హి.స.)

నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి మెటర్నిటీ సెలవుపై వెళ్లారు. దీంతో పక్కనే ఉన్న నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిఓఆర్టి 1111 జారీ అయ్యింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా నిర్మల్ కలెక్టర్ కు బాధ్యతలు అప్పచెప్పారు. కాగా సెలవు పై వెళ్లిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి కి తాజాగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా భర్త కావడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande