అన్ని శాఖల సమన్వయంతో 'ఆపరేషన్ ముస్కాన్' విజయవంతం: రాజన్న జిల్లాఎస్పీ
అన్ని శాఖల సమన్వయంతో 'ఆపరేషన్ ముస్కాన్' విజయవంతం: రాజన్న జిల్లాఎస్పీ
Sp


రాజన్న సిరిసిల్ల, 01 ఆగస్టు (హి.స.)

బాలల సంరక్షణ,బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా 104 మంది బాల బాలికలను గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు హాజరు పరచి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం అప్పగించామన్నారు. అలాగే 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని పనిచేయిస్తున్న వారి పై 27 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు శాఖతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక, విద్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. బాలకార్మికులను గుర్తించినా, వీధి బాలలు కనిపించినా వెంటనే సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బాలలతో పనులు చేయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande