
హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.) తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పోలీస్, జైళ్ల శాఖ, SPF, ఫైర్ విభాగాల్లో నియామకాలు చేపడుతున్నట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్