రేపు ఆత్మకూరులో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ
రేపు ఆత్మకూరులో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ
/atmakur-free-health-camp-and-medicine-distribution-on-aug-2-168636


నెల్లూరు, 01 ఆగస్టు (హి.స.)ఆత్మకూరు: జన విజ్ఞాన వేదిక ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో, డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం సహకారంతో ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల వైద్య శిబిరం రేపు ఆగస్టు 2వ తేదీ ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించనున్నారు.

శ్రీ షిరిడి సాయిరాం కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరం కొనసాగనుంది. విజయవాడలో సమావేశం ఉన్న కారణంగా వైద్యులు డాక్టర్ ఎం.వి. రమణయ్య ఈసారి శిబిరానికి హాజరు కావడం లేదని నిర్వాహకులు తెలిపారు.

ఇతర వైద్యులు కూడా అందుబాటులో లేని నేపథ్యంలో, గత రెండు నెలల క్రితం డాక్టర్ పరీక్షించి సూచించిన మందులనే తిరిగి అందించనున్నట్లు పేర్కొన్నారు. కేవలం మందులు అవసరమైన వారు మాత్రమే శిబిరానికి హాజరై మందులు తీసుకెళ్లాలని సూచించారు.

శిబిరానికి వచ్చే పేషెంట్లు గతంలో ఇచ్చిన మందుల చీటీ లేదా మందుల పుస్తకాన్ని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కోరారు. షుగర్ పరీక్ష ఒకసారి చేయించుకునేందుకు రూ.25, ఆహారం తీసుకున్న అనంతరం రెండోసారి పరీక్ష చేయించుకునేవారు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఒక్క డోస్కు రూ.100గా నిర్ణయించారు. రెండు నెలలకు సరిపడే షుగర్, బీపీ మందులను కేవలం రూ.250కే అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పేషెంట్లు ఉదయం 11 గంటలలోపు శిబిరానికి హాజరై వైద్య సేవలు, మందులు పొందాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande