ఉత్తరాంధ్ర నయా విమాన గమ్యం: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
ఉత్తరాంధ్ర నయా విమాన గమ్యం: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
Chandra Babu Naidu


విజయనగరం, 01 ఆగస్టు (హి.స.)

విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు (ఆగస్టు 1, 2026) అత్యంత వైభవంగా జరిగింది.

సీఎం చంద్రబాబు నాయుడు: వలసల ఉత్తరాంధ్ర.. ఇకపై ఉద్యోగాల ఉత్తమాంధ్ర

వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఎగిరే పక్షి ఆకారంలో, సముద్రం మరియు పచ్చని కొండల మధ్య నిర్మించిన భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ఇకపై ఆ రోజులు గతం కానున్నాయని భరోసా ఇచ్చారు. వేరే ప్రాంతాల వారే ఇక్కడికి ఉద్యోగాల కోసం వలస వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ఈ ప్రాంతం 'ఉత్తమాంధ్ర'గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర సహకారంతో ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో 189 భారీ ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. అలాగే ₹2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరేడి బ్యారేజ్‌ కలను నిజం చేస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చి అండగా నిలిచిందని, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి, ఆ ఘనతను దేశానికి చాటుతామని సీఎం పునరుద్ఘాటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande