గుంటూరుకు చెందిన ప్రముఖ వెన్నెముక శాస్త్ర.చికిత్స నిపుణుడు డా.నరేష్ బాబు కు అంతర్జాతీయ గుర్తింపు
గుంటూరుకు చెందిన ప్రముఖ వెన్నెముక శాస్త్ర.చికిత్స నిపుణుడు డా.నరేష్ బాబు కు అంతర్జాతీయ గుర్తింపు
గుంటూరుకు చెందిన ప్రముఖ వెన్నెముక శాస్త్ర.చికిత్స నిపుణుడు డా.నరేష్ బాబు కు అంతర్జాతీయ గుర్తింపు


గుంటూరు, 01 ఆగస్టు (హి.స.)

గుంటూరుకు చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు, మల్లిక స్పెయిన్ సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్బాబుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగపూర్లో జులై 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ వెన్నెముక నిపుణుల ఉమ్మడి వార్షిక సదస్సులో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఉత్తమ పరిశోధన పత్రం’ పురస్కారం లభించింది. మెడ, వెన్నెముక సమస్యలపై ఆయన చేసిన సరికొత్త పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది. సాధారణంగా మెడ నొప్పితో బాధపడేవారికి వైద్యులు పడుకోబెట్టి ఎంఆర్ఐ స్కాన్ తీయిస్తారు. రోగులు పడుకున్నప్పుడు మెడలో పెద్దగా మార్పులు తెలియవు. దీనిని అధిగమించడానికి డాక్టర్ నరేష్బాబు ప్రపంచంలోనే తొలిసారిగా ‘సిట్టింగ్ ఎంఆర్ఐ’ (కూర్చుని తీసే స్కాన్) సాంకేతికతను వాడారు. కూర్చున్నా, నిలబడినా, మెడను ముందుకు, వెనక్కు వంచినప్పుడు లోపల వెన్నెముకలో జరిగే మార్పులు, మెడ సమస్యలు ఉన్నవారిలో లోపలి కండరాలు వదులుగా మారిపోతాయని తేలింది. దీనివల్ల, మనం మెడ కదిలించిన ప్రతిసారీ వెన్నుపాము నరంపై తీవ్ర ఒత్తిడి పడి మెడ నొప్పి, చేతులు లాగడం ఎక్కువవుతాయని ఆయన పరిశోధనలో నిరూపించారు. ఈ పరిశోధన వల్ల మెడ, వెన్నెముక సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్బాబు మాట్లాడుతూ 2007లో సింగపూర్ నుంచి అవార్డు అందుకున్నానని, 19 ఏళ్ల తర్వాత అదే దేశంలో అంతర్జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన పరిశోధన బృందం కృషితో ఈ విజయం దక్కిందన్నారు. గుంటూరులోని ‘మల్లిక స్పైన్ సెంటర్’ అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande