తెలుగు ప్రజలకు అలర్ట్.. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు ప్రజలకు అలర్ట్.. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు ఛాన్స్ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
damage in Viramgam-Mandal-Detroj farmers due to heavy rains in gujarat


కర్నూలు, 01 ఆగస్టు (హి.స.) తెలుగు ప్రజలకు అలర్ట్.. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు ఛాన్స్ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలుకు గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులు ఉంది. ఈ రాత్రికి ఇవాళ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు ఇవాళ పడే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ లో భారీ వర్షాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande