
రేణిగుంట, 01 ఆగస్టు (హి.స.) రేణిగుంట మండలంలో ఈ రోజు శనివారం ఉదయం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ను పంపిణీ చేస్తూ,ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జ్ డి. పుష్పనాధం మాట్లాడుతూ,అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు నవాబ్, అఫ్రోజ్,గౌసి,అంబి,సాగర్, ఏలూమలై తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV