తిరుమల అప్డేట్: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల అప్డేట్: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల


తిరుమల , 01 ఆగస్టు (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో ఎలాంటి దర్శనం టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

మరోవైపు, శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే మొత్తం 71,393 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 27,846 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి నివాళులర్పించారు. కాగా, నిన్న స్వామి వారి హుండీ ద్వారా రూ. 4.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులు ఓపికతో సహకరించాలని టీటీడీ కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande