రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు.
vempalli-apcc-leader-n-tulasi-reddy-birthday-celebrated-16


వేంపల్లి, 01 ఆగస్టు (హి.స.): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం కడప జిల్లా వేంపల్లిలోని ఆయన స్వగృహంలో మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డాక్టర్ ఎన్. తులసిరెడ్డి అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. మాజీ రాజ్యసభ సభ్యునిగా, మాజీ ఎమ్మెల్సీగా, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్గా, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్గా, ప్రస్తుతం ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్గా ఆయన విశిష్ట సేవలందిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడంలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో డాక్టర్ ఎన్. తులసిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande