భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం
bhogapuram


విశాఖ:, 17 ఆగస్టు (హి.స.)

ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ బయల్దేరింది. సోమవారం ఉయదం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీసు భోగాపురం చేరుకుంది. దీనికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. ఉదయం 7:30 తర్వాత తొలి విమానం హైదరాబాద్ వెళ్లనుంది. 8 గంటలకు బెంగళూరుకు, 8.20కి దిల్లీకి, 8.50కి హైదరాబాద్కు సర్వీసులు బయలుదేరతాయి. విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande