కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ తెలుసు.. ఎంపీ అరవింద్
కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ తెలుసు.. ఎంపీ అరవింద్
MP


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అంతా పొద్దస్తమానం భారతదేశంపై విద్వేషం వెల్లగక్కేవారితో జరగబోతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి వెళ్తున్న ప్రాంతాలు, కలుస్తున్న మనషులు అంతా యాంటీ ఇండియా, యాంటీ నేషనలిస్టుల ఐడియాలజీలు ఉన్న జార్జ్ సోరోస్ లాంటి వారు ఫండింగ్ చేసిన సంస్థలేనన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీడియాతో మాట్లాడిన అర్వింద్.. రాష్ట్ర జాగ్రఫీ తెలియని వ్యక్తి, ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని చెప్పిన వ్యక్తి విదేశాల్లో వెళ్లి ఏం మాట్లాడుతాడు అని ప్రశ్నించారు. మోడీ హయంలో భారత దేశంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటే నిద్రపట్టనటువండి విద్యాసంస్థకు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ప్రభుత్వం పూర్తి ఎజెండా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏం చేద్దామని యాంటీ ఇండియా స్కూల్ కు ఎందుకు వెళ్తున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ నాయకుల వలలో పడవద్దని రాజశేఖర్ రెడ్డి హయాంలో అనేక మంది మంచి మంచి అధికారులు జైళ్లపాలయ్యారని.. వైఎస్సార్ తో పోలిస్తే రేవంత్ రెడ్డి చాలా చిన్న వ్యక్తి. ఆయన మీ భవిష్యత్ను కాపాడలేరని అన్నారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాదని అధికారులను ఈ రేవంత్ రెడ్డి కాపాడలేరని అన్నారు. జీవన్ రెడ్డి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ తెలుసని అందుకే 2029లో తెలంగాణలో సూపర్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఏమైనా చేస్తామని లీగల్గా చేసి అధికారంలోకి రాబోతోందన్నారు. పరిస్థితులు చూస్తుందే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బాండ్ పేపర్ రాసి ఇవ్వాలనుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande